స్వాతి కి కలిగిన వింత కోరిక…!

Posted : September 18, 2014 at 10:48 pm IST by ManaTeluguMovies

colors-Swathi

బుల్లితెర పై కలర్స్ స్వాతిగా పేరు తెచ్చుకుని అదే పేరును ఇంటి పేరుగా కొనసాగిస్తూ, రష్యాలో పుట్టిన ఈ తెలుగు అమ్మాయికి కలిగిన వింత కోరిక ఆశ్చర్యంగా మారింది. ఈమెకు సీత, ద్రౌపది లాంటి పురాణ పాత్రలను తెలుగు సినిమాలలో చేయాలని కోరికట. అయితే స్వాతి కోరికను మన్నించే నిర్మాతలు మన టాలీవుడ్ లో ఉన్నారా? అన్నదే ప్రశ్న.

ఎప్పటి నుంచో ‘నర్తనశాల’ సినిమాను తీయాలనే కోరిక ఉన్నా ద్రౌపది పాత్ర చేసే హీరోయిన్ దొరకక పోవడంతో ‘నర్తనశాల’ ను తీయలేకపోతున్న బాలకృష్ణ స్వాతి కోరికను తెలుసుకుని ఆమెకు అవకాశం ఇస్తాడేమో చూడాలి. ఇది ఇలా ఉండగా ఈకలర్స్ పాపకు బాలీవుడ్ సినిమాలలో కుడా నటిస్తూ ఫిలిం ఫేర్ అవార్డు లు పొందాలనే కోరిక ఉందనే విషయాన్ని మీడియాకు లీక్ చేస్తోంది.

అయితే ఇన్ని కోరికలతో ఉన్న స్వాతి ఆశలు తీరే రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి. స్వాతి ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కార్తికేయ’ సినిమా విజయవంతం అయినా ఈమె కోరికలు తీరే అవకాసం లేదు. గ్లామర్ పాత్రలు చేయాలని టాప్ హీరోయిన్స్ అంతా పరుగులు తీస్తూ ఉంటే స్వాతి మాత్రం పురాణ పాత్రలు ఎంచు కోవడం వైవిధ్యమే.