మిల్కీ బ్యూటీ సౌందర్య రహస్యం…

Posted : June 17, 2014 at 9:38 pm IST by ManaTeluguMovies

Milky-Beauty-Tammu

అందం చూడవయా ఆనందించవయా అంటూ ఓ కవి తన అభిప్రాయూన్ని పాటలో కడు రమ్యంగా చెప్పారు. అందానికి గులాంకాని మగవాడుండడు. అందానికి అంత పవర్ ఉంది. అలాంటి అందం కోసం మగువలు కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంటారు. ప్రత్యేక అందాలను సొంతం చేసుకున్న నటి తమన్న. మిల్కీ బ్యూటీగా పేరొందిన తమన్న దక్షిణాది చిత్రాల్లో నటించిన్పుడు కాస్త భారీ అందాలనే ప్రదర్శించారు. బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన తరువాత నడుమెక్కడే నవలావని అని పాడుకునేంతలా నాజూగ్గా తయారయ్యారు.

ఈ ముద్దుగుమ్మ సౌందర్య రహస్యం ఏమిటన్న విషయాన్ని ఆమె మాటల్లోనే చూద్దాం. చదువుకునే రోజుల్లో ఆటలంటేనే తప్పించుకు తిరిగేదాన్ని. ఆహారం కూడా ఎక్కువగా తినేదాన్ని కాదు. రోజుకు రెండు సార్లు మాత్రమే భోజనం చేసేదాన్ని. 14 ఏళ్ల వయసులోనే నటిగా రంగ ప్రవేశం చేశాను. సరైన ఆహారం ఎంత అవసరమో అప్పుడు గ్రహించాను. పౌష్టికాహారం వ్యాయామం ఒక సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌కు చాలా అవసరం అని అర్థమైంది. ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లినప్పుడు ఈ విషయాలన్నీ అవగతం అయ్యాయి. నా జీవితంలో ముఖ్యమైన మలుపు అదే.

నిత్యం యోగా చేస్తాను. శారీరక వ్యాయామం తప్పనిసరి. పరిమిత ఆహారం తీసుకోవడం మొదలెట్టాక ఎనర్జీ పెరిగింది. రెండు గంటలకోసారి డైట్ ఆహారం తింటున్నాను. ఉదయం కార్బొహైడ్రేడ్, సాయంత్రం ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాను. బిరియానీ ప్రియురాలిని, అప్పుడప్పుడు దానిపై మనసు లాగుతుంది. ము ఖం మృదువుగా ఉండడానికి పెరు గు, చందనం, పసుపు, పప్పుల మిశ్రమం అప్లై చేస్తాను. వారానికి రెండు సార్లు తలార స్నా నం చేస్తాను. నా అందాన్ని కాపాడే టిప్స్ ఇవేనని తమన్న వెల్లడించారు.