ఫ్యామిలీ మొత్తాన్ని దింపిన బాలయ్య !

Posted : May 1, 2014 at 3:33 am IST by ManaTeluguMovies

Untitled
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని ఉవ్విళ్ళూరుతున్న బాలయ్య తన నియోజకవర్గం హిందూపురంలో ప్రచారం ఆదరగొడుతున్నాడు. నామినేషన్ వేసిన దగ్గర నుండి హిందూపురంలోనే మకాం పెట్టిన బాలయ్య రోజంతా రోడ్ షోలు అని, మీటింగులు అని క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.


అయితే బాలయ్య ఒక్కడే కష్టపడడం చూసి చలించిన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు బాలయ్యకు హెల్ప్ చెయ్యడానికి రోడ్డున పడ్డారు. అనంతపురం పట్టణంలో జరిగిన రోడ్ షో‌లో బాలయ్య భార్య వసుంధర, ఈ మధ్యే వివాహం చేసుకున్న ఆయన రెండో కూతురు తేజస్విని, అల్లుడు భరత్ పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన భార్య వసుంధర ఓటర్లను కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.


అతి త్వరలో బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి, హీరో నారా రోహిత్ కూడా బాలయ్య కోసం రోడ్ ఎక్కనున్నారని పార్టీ వర్గాల సమాచారం. అయితే బాలయ్య ఫ్యామిలీ ప్రచారంలో పాల్గొంటున్నారు అన్న విషయం తెలుసుకున్న ప్రజలు వారిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వీళ్ళల్లో సగం మంది ఓట్లు పడ్డా బాలయ్యకు లెజెండరీ విజయం దక్కుతుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది.