నేను పెళ్లి చేసుకుంటే… మధ్యలో సమంత ఏంటి!

Posted : May 7, 2014 at 12:38 pm IST by ManaTeluguMovies

chinmayi-and-samantha

శుభమా అని నేను పెళ్లి చేసుకుంటే… మధ్యలో సమంత కి డబ్బింగ్ చెప్పే చిన్మయికి పెళ్లైందంటూ రాస్తారేంటి అని వాపోతోందిట చిన్మయి. ఆమె వివాహం గురించి మీడియాలో వచ్చే వార్తల్లో సమంత కు ఏం మాయ చేసావో చిత్రంలో డబ్బింగ్ చెప్పిన అంటూ ప్రస్దావిస్తూ ఆమె వివాహ వార్త చెప్తున్నారు. తాను ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడినా అవేమి గుర్తు చేయకపోవటం ఆమెకు బాధగానే ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఎలా పాపులర్ అయితే అలాగే ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది..వింతేముంది.

ప్రముఖ గాయని చిన్మయి, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ‘ఏ దేవి వరము నీవో..’ అంటూ ‘అమృత’ చిత్రం ద్వారా గాయనిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చిన్మయి. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో పలు చిత్రాల్లో పాటలు పాడారు. నటుడు రాహుల్‌ ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరి వివాహం సోమవారం ఉదయం చెన్నైలో జరిగింది. పలువురు సన్నిహితులు, బంధువులు, గాయకులు హాజరయ్యారు.