తాప్సి రేటెంత?

Posted : June 3, 2014 at 11:09 pm IST by ManaTeluguMovies

Tapsee-Beautiful-Stills

వరుస హిట్లు ఉంటే హీరోయిన్ల రేట్లు అమాంతంగా ఆకాశానికి ఎదిగిపోతాయి. అది సహజం. సోలోగా తనకంటూ హిట్లు లేకపోయినా తాప్సి కూడా తన ధర పెంచేసిందట. తెలుగులో వరుస ఫ్లాపులే ఆమె ఖాతాలో ఉన్నాయి. అయినా, ప్రస్తుతం ఓ రెండు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. తమిళంలో కూడా కాస్త గుర్తింపు సాధించుకుందీ భామ. అందుకే, ఇప్పుడు తన సినిమా రిలీజైతే అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ బాగా అమ్ముడు పోతుందని అమ్మడు భావిస్తోందట. కాబట్టే తన ధరను పెంచేసిందని టాక్.

ఇంతకుముందు దాదాపు రూ. 40 లక్షలకే వచ్చేసేది తాప్సి. ఈ మొత్తానికి మరో 20 ల కారాలు జోడించిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ఓ నిర్మాత పాత రేటు ప్రకారమే మాట్లాడితే… తన మార్కెట్ బాగా పెరిగిందని, అందుకే 60 లక్షలు కావాలని తాప్సి డిమాండ్ చేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడే ఆమె ఇలా ఉందంటే… ఒక సూపర్ హిట్గానీ ఈ అమ్మాయి కెరీర్లోగానీ పడితేగానీ… ఇంకెంత పెంచేస్తుందో?