చిరంజీవి షో అట్టర్ ఫ్లాప్..!

Posted : May 2, 2014 at 6:12 am IST by ManaTeluguMovies

Untitled

సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార సారథి చిన్నబోయాడు. రోజు రోజుకు ఆదరణ కరువైపోతోంది. ప్రజలే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా దగ్గరకు రావడం లేదు. ప్రచారానికి వెళితే ప్రజలు పారిపోతున్నారు. కొన్ని చోట్ల టమాటలు, కోడిగుడ్లు,రాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు చిరంజీవి. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచారపగ్గాలు చేజిక్కించుకున్న చిరంజీవికి ఏమీ తోచని పరిస్థితి నెలకొంది.

అయినా చిరంజీవి డోంట్ కేర్ అంటూ ముందుకే సాగుతున్నాడు. అయితే చిరంజీవి ప్రసంగాలు కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో మీడియా కూడా పవన్ ప్రసంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత చిరుకు ఇవ్వడం లేదు. దీంతో సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ మరింతా పడిపోతుందేమోనని కాంగ్రెస్ శ్రేణులు భయపడుతున్నాయి. ప్రచారానికి ప్రజలు రాకుంటే బాధలేదు.. కానీ సొంత పార్టీ నేతలు కూడా చిరంజీవి పెద్దగా పట్టించుకోకపోవడం ఆయనకు తీవ్ర పరాభవాన్ని మిగిలించింది.

ఒంగోలు ప్రచారం కోసం వెళ్లిన చిరంజీవి స్థానిక అతిథిగృహంలో బసచేశారు. చిరంజీవి వచ్చాడని తెలిసినా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదట. జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే కేవలం 7 మంది అభ్యర్థులు మాత్రమే వచ్చి ఆయనను కలిశారట. ఇక ఒంగోలు లోక్ సభ అభ్యర్థి పవన్ కుమార్ చిరంజీవికి కనిపించనే లేదట. స్థానిక అభ్యర్థే స్థానికంగా లేకుంటే ఎలా అని చిరంజీవి ఆగ్రహించాడట. తానొస్తే కనీసం వందమందిని తెచ్చుకోలేనివారికి జనం ఏం ఓట్లేస్తారని అలిగి స్థానికంగా ఉన్న రోడ్డుషో ను కూడా రద్దు చేసుకుని వెళ్లిపోయాడట. మొత్తానికి చిరంజీవి ప్రచారం ఫ్లాప్ సినిమాలా మారుతోందనే టాక్ మొదలైంది.